సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా వచ్చే నెల మార్చి 8న భీమవరం లో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ లో మోటార్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు గురించి కక్షిదారులకు అవగాహన కల్పించి ఎక్కువ కేసుల రాజీకి కృషి చేయుటకు న్యాయవాదులతో 3వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి Dr.B. లక్ష్మి నారాయణ న్యాయవాదులతో సమావేశమయ్యారు. న్యాయమూర్తి మాట్లాడుతూ సుమారు 200 ఇన్సూరెన్స్ కేసులు రాజీకి ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్ కేసుల్లో రాజీ చేసుకుంటే కాలయాపన ఉండదని సత్వర న్యాయం జరుగుతుందన్నారు.ఈ సమావేశం లో న్యాయవాదులు నిమ్మల సత్యనారాయణ, పాకా రమేష్ బాబు, N.సుధీర్, శేషు తదితరులు పాల్గొన్నారూ
