సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలంగాణ లో మార్వాడిల వ్యాపార ఆధిపత్యం చేస్తున్నారంటూ స్థానిక తెలుగు వ్యాపారులు నిరసనలు సికిందరాబాద్ లో ఉద్యమ రూపం దాల్చింది. దీనితో రాష్ట్రంలో కొత్త రాజకీయానికి తెర లేచింది. మార్వాడీలు లాభనష్టాలతో ప్రమేయం లేకుండా మార్కెట్ లో స్థానం కోసం ప్యూహాత్మకంగా తమ వస్తువులను ప్రజలకు తక్కువ ధరకు విక్రయిస్తూన్నారని స్థానిక తెలుగు వ్యాపారులకు వ్యాపారం లేకుండా చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. వారి దుకాణాలలో వాచ్‌మెన్ల నుంచి సర్వెంట్ల వరకు .. తమ మార్వాడీలకే ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు తప్పా.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని పిర్యదులు ఉన్నాయి. . ఇక మార్వాడిలు గోబ్యాక్ ఉద్యమాన్ని జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం గుంభనంగా వ్యవహరించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులాలలో అభిప్రాయభేదాలు తొలగించడానికి సమన్వయ ఏర్పాట్లు చేస్తే మంచిది
