సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టాన పురాధీశ్వరిని సంక్రాంతి నేపథ్యంలో వేడుకలకు ఇక్కడకు వచ్చిన తెలుగు రాష్ట్రాల కు చెందిన తమిళనాడు కు చెందిన ఎందరో మంత్రులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మైక్రో, స్మాల్ & గ్రామీణ పేదరిక నిర్మూలనం సంఘం (SERP) శాఖ ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు శ్రీ అమ్మవారిని పంచ హరతులు సమయంలో దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందచేసారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పాల్గొన్నారు.
