సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నక్సల్స్ ఉద్యమాన్ని కూకటివేళ్లతో ప్రేకిలించే ప్రయత్నంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దాటికి.. కొత్త ఏడాది ప్రారంభంలోనే మావోయిస్టు నక్సల్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నేడు, శనివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సుక్మా – బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలు – మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
