సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:దేశవ్యాప్తంగా మావో ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసేందుకు కేంద్ర హోమ్ శాఖ కంకణం కట్టుకొన్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో నేడు, గురువారం మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు అని అధికారికంగా ప్రకటించినప్పటికీ మృతులు పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో కీలక అగ్రనేతలు ఉండవచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ నుంచి కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించారంటూ నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు.. ఈ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ కార్యదర్శి దేవ్ జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులు..భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. వెంటనే భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులకు దిగటం తో ఈ ఎన్కౌంటర్ జరిగిందని ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *