సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మాస్ మహారాజా రవితేజ ఇటీవల కాలంలో చాల వెనుకబడ్డాడు. అయితే ఆయన ఆఖరి ఓ మోస్తరు హిట్ సినిమా ధమాకా కాంబినేషన్ హీరోయిన్ శ్రీలీల తో కలపి అగ్ర నిర్మాత నాగవంశీ మాస్ ప్రేక్షకులను టార్గెట్ గా తయారు చేసిన రవితేజ (Raviteja) 75వ చిత్రం మాస్ జాతర. గత రాత్రి నుండి ప్రీమియర్ షో లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడిగా మారిన రచయిత భాను భోగవరపు‘మాస్ జాతర‘ మూవీని తీశాడు. సినిమా కధ విషయానికి వస్తే.. షరా మాములుగా ఇదో గంజాయి అక్రమ రవాణా బేస్ చేసుకొన్నా కధ .. చిన్ననాటి నుండి పోలీస్ అవ్వాలన్నది లక్ష్మణ్‌ భేరీ (రవితేజ) చిన్నప్పటి కోరిక. అయితే నిజాయితీ పరుడైన కొడుకును, కోడలిని పోగొట్టుకున్న అతని తాత (రాజేంద్ర ప్రసాద్ Rajendra Prasad) మనవడికి నచ్చచెప్పి రిస్క్ తక్కువ ఉండే రైల్వే పోలీస్ గా చేస్తాడు. కానీ లక్ష్మణ్‌ భేరీ ఎక్కడికి ట్రాన్స్ ఫర్ కోసం వెళ్ళినా…రైల్వే స్టేషన్ మాత్రమే కాదు. ఊరు మొత్తాన్ని ఉద్ధరించే రకం. అతని ట్రాక్ రికార్డ్ గమనించిన పై అధికారి అజిత్ నారాయణ (సముద్రఖని ) ఉత్తరాంధ్రలోని ‘అడవివరం’కు పంపుతాడు. అక్కడ గంజాయి వ్యాపారాన్ని చేసే శివుడు (నవీన్ చంద్ర Naveen Chandra)కు లక్ష్మణ్‌ భేరీ ఎలా బుద్ధి చెప్పాడన్నదే మిగతా సినిమా. వయసు దాటిపోతున్నా లక్ష్మణ్‌ భేరీకి అడివి వరంలో గంజాయి వనంలో తులసీ (శ్రీలీల Sreeleela) అనే అమ్మాయితో పరిచయం అయ్యి అది ప్రేమగా మారుతుంది. ఊహించని ట్విస్ట్ లతో ఎలా సుఖాంతం అయ్యిందన్నది మరో కథ! ఇక సినిమా విశ్లేషణ కు వస్తే.. వయస్సు పెరిగిపోయిన రవితేజ ముఖంలో ఆ ఛాయలు స్వష్టంగా కనపడుతున్నాయి. గ్లామర్ లేకపోతె కష్టం.. ఈ కథను రాసుకుని, ఆయనతో చేసినట్టుగా ఉంది తప్పితే ఎలాంటి కొత్తదానికీ మేకర్స్ ప్రయత్నించలేదు. కొత్తవాడైన దర్శకుడు ని నమ్మి సరుకు లేని రొటీన్ సినిమాపై కోట్ల రూపాయలను నీళ్ళులా ఖర్చు పెట్టారు. కనీసం సన్నివేశాలనైనా అదరగొట్టాలి కదా?హీరో గుర్తొచ్చినప్పుడల్లా తెలంగాణ యాస మాట్లాడుతుంటాడు. రవితేజకు తండ్రి కాదు ఏకంగా తాత పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించడం విడ్డురం.. గెటప్ మాత్రమే వైరైటీగా ఉంది. ఆయనను, నరేష్ ను సరిగ్గా వాడుకోలేదు. మాత్రం మామూలుగా మాట్లాడేస్తుంటాడు. శివుడి పాత్రలో నవీన్ చంద్ర కాస్త మార్కులు కొట్టాడు.. మురళీశర్మ పాత్రను కామెడీ చేసేశారు. హీరోయిన్ శ్రీలీల కొన్ని కీలక సన్నివేశాల్లో తేలిపోయింది.మొత్తానికి సీనిమా ఎదో చుట్టేశారు. అంతే .. రవితేజా మాస్ అభిమానులకు ఓకే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *