సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ పోలీసులు గత రాత్రి ఒక పామ్ హౌస్ లో టీఆరెస్ కు చెందిన 4 గురు ఎమ్మెల్యేలను బీజేపీకి మద్దతుగా 100 కోట్ల రూప్యాలుతో కొనుగోలు చెయ్యడానికి జరిగిన ప్రయత్నంలో ప్రముఖ స్వామీజీలు పాల్గొన్నారని, సిసి ఫుటేజ్ ఆధారాలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నామని , దీనికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ముందుగానే పోలీసులకు సహకరించి స్టింగ్ ఆపరేషన్ లో సహకరించారని ప్రకటించారు. ( గతంలో రేవంత్ రెడ్డి పట్టుబడిన ఓటుకు నోటు కేసు తరహాలోనే ..)దీనితో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆరెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బ్రోకర్ బీజేపీ బంధానికి సాక్ష్యాలు అంటూ కొన్ని ఫోటోలను టీఆర్ఎస్ ట్విటర్‌లో నేడు, గురువారం ఉదయం నుండి పోస్ట్ చేసింది. బీజేపీ నేతలతో రామచంద్ర భారతి , నందు కలిసి ఉన్న ఫొటోలను టీఆర్ఎస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.బ్రోకర్ బీజేపీ బంధానికి సాక్ష్యాలు అంటూ కొన్ని ఫోటోలను టీఆర్ఎస్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. బీజేపీ నేతలతో రామచంద్ర భారతి , నందు కలిసి ఉన్న ఫొటోలను టీఆర్ఎస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా , యోగి అధిత్యనాథ్‌ కు రామచంద్ర భారతి సన్నిహితుడు. సింహయాజులుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో.. ఏపీ, తెలంగాణలోని బీజేపీ నేతలతో దగ్గరి సంబంధాలున్నాయని టీఆర్ఎస్ పేర్కొంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ గుట్టు రట్టయిందని తెలిపింది. బీజేపీ బొక్క బోర్లా పడిందని… కమలం ఆపరేషన్ ఆకర్ష్ వికటించిందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *