సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి లో నేటి శనివారం రాత్రి జరిగిన గేమ్ చేంజెర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తమ సినిమా రాజకీయ నేపథ్యంలో తీసినదని అయితే రాజకీయాలలో నిజమైన గేమ్ చేంజెర్ మా పవన్ కళ్యాణ్ గారు నా ప్రక్కన నిలబడి ఉన్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. ఈనాడు సినిమా రంగంలో గాని రాజకీయ రంగంలో గాని పవన్ కళ్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా.. దానికి కారణం చిరంజీవి గారు. మీరు కళ్యాణ్ బాబు అని అరిచినా, ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అని అరిచినా దానికి చిరంజీవి గారే ఆద్యులు. మూలాలు మర్చిపోకూడదని ( నర్మ గర్భంగా అల్లు అర్జున్ గురించా?) అందరూ చిరంజీవి గారి కష్టం నుండే గుర్తింపు తెచుకొన్నవారమని అన్నారు. సీఎం చంద్రబాబు గారి సహకారం, మద్దతు వల్లే ఈ రోజు ఇక్కడ ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించుకోగల్గుతున్నాం. అగ్ర దర్శకుడు శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో బ్లాక్ లో టికెట్ కొనుకొన్ని చూశాను. ప్రేమికుడు సినిమాకు అమ్మమ్మతో వెళ్లాను. ఒకే ఒక్కడు వంటి సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్ గారు సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు కారణం. అందులో శంకర్ గారు ఒకరు. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు వకీల్ సాబ్ సినిమా ఇచ్చారు దిల్ రాజు. ఆయన ఇచ్చిన డబ్బులే జనసేనకు ఇంధనంగా మారింది. నాకు చిరంజీవి పితృసమానులు. నేను రామ్ చరణ్‌కు బాబాయ్‌లా ఉండను. రామ్ చరణ్ నాకు సోదర సమానుడు. చిన్నప్పటి నుండి చాల కష్టపడ్డాడు. . ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాను. నాకు చాలా నచ్చింది.. ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరూ క్షేమంగా తిరిగి వెళ్లాలి. మీకు ఏమైనా అయితే నా గుండెకు గాయమైనట్టుగా ఉంటుంది. సినిమాను సినిమాలా చూడండి.అన్నారు పవన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *