సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో నేడు, మంగళవారం జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తలు తో కూడిన ఇన్వెస్టర్స్ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆర్ధిక అభివృద్ధి లో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానం లో ఉందని, జిడిపి లో కూడా నెంబర్ వన్ గా కొనసాగుతుందని మరి కొద్దీ రోజులలో ఏపీ రాజధాని విశాఖ కానున్నదని, తాము త్వరలోనే విశాఖకు మారబోతున్నామని చెప్పారు. వచ్చే మార్చి 3, 4 తేదీలలో జరగనున్న గ్లోబెల్ ఇన్వెస్టర్స్ సమావేశాలు విశాఖ లో నిర్వహిస్తున్నామని మరి అందరు రాజధాని గా మారుతున్నా విశాఖకు రావాలని,అక్కడ మీ కంపెనీలు సంస్థలు ఏర్పాటుకు అన్ని వసతులు, సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని, రాజధాని గా విశాఖ కు మీ సహకారం ఎంతో కావలసి ఉందని ఇన్వెస్టర్లను కోరారు. ప్రపంచ పటంలో విశాఖ కు ఉన్నత స్థానం సాధించడం ఖాయం అన్నారు. దేశంలో టాప్ 10 నగరాలలో విశాఖ ఇప్పటికే స్థానం సంపాదించిందని, విశాఖ నగరానికి ఉన్న సామర్థ్యంపై ప్రధాని మోడీ కూడా ఇటీవల ప్రశంసలు కురిపించారని గుర్తు చేస్తూ ..దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు లో 3 ఏపీకే రావడం దీనికి సహకరించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
