సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల జరిగిన మా ఎన్నికలు ఎంతటి వివాదాలు సృష్టించాయో అందరికి తెలిసిందే. అయితే నేడు, ఆదివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)అధ్యక్షుడు మంచు విష్ణు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ‘మా’ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున గెలుపొందిన శ్రీకాంత్ తదితర 11 మంది రాజీనామాలను ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని మంచు విష్ణు అన్నారు. అయితే ‘మా’సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించలేదని తెలిపారు. ‘మా’ బిల్డింగ్‌పై చర్చలు జరుగుతున్నాయని దీనిపై పదిరోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని మంచు విష్ణు అన్నారు.
