సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా అందులో ఏకంగా 10 కి పైగా అవార్డ్స్ తెలుగు సినీ పరిశ్రమకు దక్కడంతో పాటు తెలుగులో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి రావడం, తో ఆ సినిమాను , మరియు ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి మూవీస్ నిర్మాతలు నవీన్ యెర్నేని , వై రవిశంకర్ ల ఆనందానికి అంతులేదు.. వారిరువురు నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేము నిర్మించిన ‘పుష్ప’ చిత్రానికి అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకోవడం చాలా గర్వంగా వుందని.. ఇది చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు. అలాగే ‘పుష్ప’ చిత్రానికి సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్‌ని సొంతం చేసుకున్నారని అలాగే జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ చిత్రం అవార్డ్‌ని కైవశం చేసుకోవడం కూడా గర్వకారణంగా ఉందని వారు అన్నారు,
