సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగం నేడు, శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలంగాణపై వరాల జల్లు కురిపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే 4శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తరువాత మిగులు బడ్జెట్ తో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 ఏళ్లుగా సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన తో అవినీతి తో అప్పుల కుప్పగా మార్చేశారని విమర్శించారు. కేసీఆర్ హాయాంలో యువత సహా.. అన్ని వర్గాలు నిరాశలో ఉన్నాయని .. కెసిఆర్ ను ఇంటికి పంపించాలని తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. ఈసారి బీజేపీకి ప్రజలు అవకాశమిస్తే డబల్ ఇంజిన్ సర్కార్ లాగా అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తామని అన్నారు. రైతులకు వరి పంటకు వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు పథకాలు ఇస్తామని లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారన్నారు. రూ.3,116 నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని అమిత్ షా ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో కాదు‌ .. ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండాలన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపి అవినీతి పరులను జైలుకు పంపుతామని అమిత్ షా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *