సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా నేడు, సోమవారం ప్రాంతీయ పార్టీల హవనడిచే… మిజోరం అసెంబ్లీ ఎన్నికలఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. నేటి మధ్యాహ్నం 1గంటన్నర కు తాజా సమాచారం ప్రకారం ప్రతిపక్ష పార్టీ అయిన జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM)దూసుకుపోతోంది. ప్రస్తుతానికి అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) కేవలం 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. గతంలో ప్రతిపక్ష జెడ్‌పీఎమ్ రెండు స్థానాల్లో గెలుపొందగా..తాజా ఫలితాలలో అనూహ్యంగా 27 స్థానాల్లో విజయం సాధిస్తుంది.. బీజేపీ 3 సీట్లోలనూ, కాంగ్రెస్ 1 సీటులోనూ ఆధిక్యంలో కొనసాగు తున్నాయి.40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరగ్గా.. 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఆదివారమే మిజోరం కౌంటింగ్ కూడా జరగాల్సి ఉంది. అయితే క్రైస్తవులు అధికంగా ఉన్న మిజోరంలో ఆదివారం సామూహిక ప్రార్థనలు జరుగుతాయి. మిజోరంలో కౌంటింగ్‌ను ఎలక్షన్ కమిషన్ సోమవారానికి వాయిదా వేసింది. అధికారం దిశగా దూసుకుపోతున్న జెడ్‌పీఎమ్ అధినేత 74 ఏళ్ల.. లాల్ దహోమా గతంలో IPS అధికారిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున 1984లో లోక్‌సభలో అడుగుపెట్టారు. అనంతరం 2017లో జోరం నేషనలిస్ట్ పార్టీ స్థాపించి ఆ తర్వాత జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌ కూటమిలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో సీఎం పదవికి చేరువవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *