సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మిత్రులకు మధ్య వర్తిగా ఉండి అప్పులు ఇప్పించిన పాపానికి ఆ అప్పులు వసూలు కాకపోవడం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నా తాజా ఘటన భీమవరం శివారులోని విస్సాకోడేరు లో తాజాగా వెలుగులోకి వచ్చింది. . మృతుడి భార్య పాలకోడేరు పోలీసులకు ఇచ్చి న ఫిర్యా దు ప్రకారం .. విస్సా కోడేరు గ్రామానికి చెందిన రాజేష్ కుమార్ తనకు మిత్రులు అయిన భీమవరం పట్టణానికి చెందిన కలిదిండి శ్రీనివాసరాజు, ఉమ్మడి సింగ్ ఏసుబాబులకు రూ.11న్నర లక్షలు, తన సొంత పూచీకత్తుపై మధ్యవర్తిగా అప్పులు ఇప్పించాడు. అప్పు లు తీసుకున్న ఇద్దరూ వాటిని తిరిగి చెల్లిం చకపోవడంతో రుణదాతలు రాజేష్ కుమార్ ఫై ఒత్తిడి తెచ్చారు. మిత్రులను తీసుకొన్న అప్పులు తీర్చాలని, లేకపోతే తనకు ఆత్మ హత్యే గతి అని రాజేష్ కుమార్ ఎంత చెప్పిన వారు వినలేదు సరికదా! ‘నువ్వు ఛస్తే మాకేంటని’ నిర్లక్ష్యం గా సమాధానం ఇచ్చారని.. దీంతో మానసిక వ్యధ తో గత ఆదివారం రోజు సాయంత్రం తన భర్త రాజేష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై పాలకోడేరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
