సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మిర్చి ధరలు తగ్గిపోయిన నేపథ్యంలో ఏపీలో గుంటూరు ప్రాంత రైతులు కూడా మిర్చి పంటను ఈ ఏడాది తగ్గించిన ప్రస్తుతం పండిన పంట అమ్ముకోలేని పరిస్థితి. దీనితో ఇటీవల గుంటూరు మిర్చి యార్డ్ లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్యూరిటీ ని కూడా వదిలిపెట్టి మాజీ సీఎం జగన్, వేలాది మంది మిర్చి రైతులను కలసి వారి సమస్యలపై ఎలుగెత్తటం సంచలనం రేపింది. .. మరో ప్రక్క వెంటనే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో భేటీ అయి మిర్చి సమస్య లను వివరించిన నేపథ్యంలో.. కేంద్రం కూడా పడిపోయిన మిర్చిధరల విషయంలో ఏపీ మిర్చి రైతులను ఆదుకోవడానికి ముందుకు వస్తానని ప్రకటిస్తానని హామీ ఇవ్వడం అందరికి తెలిసిందే.. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నేడు, శనివారం గుంటూరు మిర్చి యార్డు ట్రేడర్లు, మిర్రి కొనుగోలు చేసే వర్తకులతో సీఎం కీలక సమావేశం నిర్వహించారు.ఈ ఏడాది మన ఏపీ నుండి మిర్చి ఎగుమతి చేసుకొనే చైనా, శ్రీలంక తదితర దేశాలు లలో మిర్చి కి డిమాండ్ తగ్గిందని అయితే త్వరలో మరల డిమాండ్ పెరుగుతుందని మిర్చి రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని .. ఆందువల్ల మిర్చి రైతులకు ట్రేడర్స్ ఇబ్బందులు కలిగించ వద్దని, సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
