సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు గత 10 నెలలుగా ఒక్కసారిగా పెరిగిపోతూ వస్తున్నా సన్న బియ్యం ధరలు కాస్త తగ్గుతూ మరల గత ఏడాది ధరలకు చేరుకొంటున్నాయి. మధ్యతరగతి , ఉన్నత వర్గ ప్రజలు ఎక్కువగా భోజనానికి ఆహారంగా వినియోగించే సన్నబియ్యం పంట పశ్చిమ గోదావరి జిల్లాలో చాల తక్కువ.. అందుకే దూరప్రాంతం నుండి ఇక్కడికి సన్న బియ్యం దిగుమతి చేసుకొంటూ ఉంటారు స్థానిక హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారులు. అతి చిన్నగా ఉండే జీళ్ళకర్ర రైస్ , జీరా రైస్ కు డిమాండ్ ఎక్కువే.. ఇక తాజగా ధరలు ప్రకారం కర్నూలు సోనా 26 కేజీల బస్తా గత ఏడాది డిసెంబరులో రూ.1450 అమ్మగా ఇప్పుడు రూ.1,250కి దిగి వచ్చింది. హెచ్‌ఎంటి రకం బియ్యం 26 కిలోలు రూ.1,600 నుంచి రూ.1400కు దిగి వచ్చింది. .పిఎల్ రకం బియ్యం గతంలో రూ.1150 ఉండేవి. ఇప్పుడు రూ.1000లకే లభ్యమవుతున్నాయి. స్వర్ణ రకం బియ్యం 26 కేజీల ప్యాకెట్ గతంలో రూ.1050 ఉండగా ఇప్పుడు రూ.900కు అమ్ముతున్నారు. కాబ్బటి తగ్గిన ధరలు తెలుసుకొని కొనుగోలు చెయ్యండి.
