సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తాజగా రైల్వే టికెట్స్ రిజర్వేషన్ విధానంలో టికెట్ కన్ఫర్మ్ కానీ ప్రయాణికులకు మరో అదనపు అవకాశం మంజూరు చేసింది. పండుగలు, ప్రత్యేక రోజులలో ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అందులో భాగంగా వికల్ప్ స్కీం (IRCTC Vikalp Scheme).ప్రవేశపెట్టింది. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులకు టికెట్ కన్ఫర్మ్ చేసిన బెర్త్ అందించడమే లక్ష్యంగా ఐఆర్సీటీసీ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీన్నే ‘ఆల్టర్నేటివ్ ట్రైన్ అకామడేషన్ స్కీం ’ అని కూడా అంటున్నారు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే.. మనం వెళ్లాలనుకుంటున్న రైలులో బెర్త్లు ఖాళీ లేనప్పు డు ఒక్కోసారి మనకు వెయిటిం గ్ లిస్ట్లో చోటు లభిస్తుంది. అయితే, చివరి వరకూ టికెట్ రాదనుకొనే సమయంలో వికల్ప్ స్కీం ను ఉపయోగపడుతుంది. టికెట్ను బుక్ చేసుకునే సమయంలో ఈ ఆప్షన్ను ఎంచుకోవాలి. అదే మార్గంలో ప్రయాణిస్తున్న మరిన్ని రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. వాటిలో ఎక్కడ బెర్త్లు ఖాళీ ఉంటే దాంట్లో మనకు సీటు కేటాయిస్తారు. ఆ విధంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్ప టికీ బెర్త్ కేటాయించే వెసులుబాటును రైల్వే శాఖ వికల్ప్ ద్వారా కల్పిస్తోంది. టికెట్ కొనుగోలు సమయం లోనే AUTO update ఎంచుకోవాల్సి ఉంటుంది.అదృష్టం బాగుంటే.. మూడో తరగతి ఏసీ, రెండో తరగతి ఏసీ.. ఒక్కో సారి ఒకటో తరగతి ఏసీలో కూడా మనకు బెర్త్ దొరికే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైలులో అన్ని ఖాళీ బెర్త్లు సద్వి నియోగం అయ్యే లా రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది
