సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సాధారణంగా ప్రతి ఆదివారం, సెలవు దినాలు వచ్చాయంటే బ్యాంకులు పని చేయవు. అయితే ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు పలుకుతున్న మార్చి 31 రోజు కూడా బ్యాంకులు ఆదివారం రావడంతో గొప్ప చిక్కు వచ్చిపడింది. ఎన్ని లావాదేవీలు ఆగిపోతాయి .?అయితే ఎలాగూ ఆ రోజు బ్యాంకులు సెలవు అని అందరూ అనుకోవచ్చు. కాని ఈ మార్చి 31 ఆదివారం బ్యాంకులు పని చేస్తాయని తాజగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రభుత్వ, ప్రయివేట్ రంగానికి సంబంధించి మొత్తం 33 బ్యాంకులు వచ్చే ఆదివారం పని చేస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. . అయితే ఆరోజు ఎలాంటి లావాదేవీలు జరపవచ్చనే దానిపై రిజర్వు బ్యాంకు క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ పరమైన అన్ని లావాదేవీలకు అనుమతి ఉంటుంది. ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు, ఆర్బీఐ కార్యాలయానికి సంబంధించిన ప్రభుత్వ లావాదేవీలు,అలాగే ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌క్షన్లు చేసుకోవచ్చని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *