సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక.. వచ్చే నెల ఏప్రిల్లో బ్యాం కులు దాదాపు సగం రోజులు పనిచేయడం లేదు. శని, ఆదివారాలతో కలిపి దాదాపు 15 రోజుల పాటు బ్యాంక్ లకు సెలవులురావడం విశేషం. ఆర్బీఐ లిస్ట్ ప్రకారం.. ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించవు. అలాగే 4వ తేదీ మహవీర్ జయంతి,(ఏపీలో సెలవు లేదు) 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, 7న గుడ్ ఫ్రైడే , 14న అంబేడ్క ర్ జయంతి, 22న రంజాన్ నేపథ్యంలో తెలంగాణలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరోవైపు రెండు, నాలుగో శనివారాలైన 8, 22వ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. అలాగే వచ్చే నెలలో మొత్తం ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో స్థానిక పండగల దృష్ట్యా ఆయా తేదీల్లో మార్పులుంటాయి.
