సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ నటుడు మోహన్‌బాబు నేడు, బుధవారం ఉదయం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. (గత రాత్రి మోహన్ బాబు ఇంటి గేటు ను బ్రద్దలు కొట్టి మనోజ్ ఇంటిలో ప్రవేశించిన నేపథ్యంలో మోహన్ బాబు అక్కడ కు కోపంగా రావడం అక్కడే మీడియా ఉండటం చూసి ముందు నమస్కారం చేసి వెంటనే పట్టరాని కోపంతో మీడియా మైకులు తీసుకోని మీడియాపై దాడికి దిగటం, టీవీ 9 విలేఖరికి తలపై తీవ్ర గాయం కావడం తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఉత్తరాది ఛానెల్స్ లో కూడా సంచలన రీతిలో ప్రసారం అయ్యింది. మోహన్ బాబు తరువాత బీపీ ఎక్కువయిందని హాస్పటల్ లో చేరటం జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఫై పోలీసులు కేసు నమోదు చెయ్యడం, మంచు కుటుంబ సభ్యుల వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్లు పోలీసులకు అప్పగించాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు పోలీసులు జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ… హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. తాను సెక్యూరిటీ కోరినప్పటికీ భద్రత కల్పించలేదని.. వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరో ప్రక్క మనోజ్ జర్నలిస్ట్ లపై జరిగిన దాడి కి తన తండ్రి క్షమాపణలు చెప్పాలని మీడియా వారితో కలసి ధర్నాకు సిద్దపడుతున్నారు.
