సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నేటి గురువారం రాత్రి నిర్వహించిన జనసేన యువశక్తి సభలో పవన్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి .. ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ పవన్ కల్యా ణ్ తన ప్రసంగం మొదలు పెట్టారు. తనకు ప్రాణ భయం లేదని అన్నింటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చానని స్ప ష్టం చేశారు. తన సభలకు వచ్చి జై జై లు కొట్టేవారు గతంలో తనకు ఓట్లు వెయ్యకుండా మోసం చేసారని, అయిన ప్రజల కోసమే పోరాడతానని, పోటీ చేసిన రెం డు చోట్ల ఓడిపోయావని విమర్శిస్తుం టే ఏ రోజూ నేను బాధపడలేదు. మరల గెలుస్తానో, మరో 2 సార్లు ఓడిపోతానో తెలియదు. కానీ పోరాటం మాత్రం ఆపను. ఈ రణస్థలం సాక్షిగాచెపుతున్నాను. కడ శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటాననిపవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సినిమాల విజయాలు తృప్తి ఇవ్వలేదు. రాష్ట్ర విభజన జరిగిన తీరు చూసి బాధ కలిగింది. ఇప్పడు మరల 3 ముక్కలు అంటున్నారు. రాజకీయ గూండాలను ఎలా ఎదుర్కో వాలో నాకు బాగా తెలుసు. చాల సుఖాలు చూశా వాటిపై నాకు మమకారంలేదు. ఇది మూడు ముక్క ల ప్రభుత్వం .. తను 3 ముక్క ల సీఎం,,. మాట్లాడితే.. 3 పెళ్లిళ్లు అంటున్నారు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి. నేను ముగ్గురికీ విడాకులు ఇచ్చి చేసుకున్నా .స్వర్గీయ మాజీ సీఎం వై ఎస్ నుద్దేశించి మీ నాన్న వైఎస్నే ఎదుర్కొ న్నా .. నువ్వెంత?పంచెలూడదీసి కొడతానని అప్పట్లోనే సవాల్ చేశా. అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా . ప్రజల కోసమే, సంబరాల రాంబాబూ పిచ్చి కూతలు, డైమండ్ రాణి రోజా తిట్లు తింటున్నాను. ‘‘సీఎం కు గ్యాంబ్లింగ్ పిచ్చి అని ఈ మధ్యే తెలిసింది. సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుంది. సలహాలిచ్చే ది సజ్జల అయితే రాజ్యం పూర్తిగా నాశనం అవుతుంది. ధర్మా నా.. 1280 ఎకరాలు తాకట్టు పెడితే మీ ఉత్తరాంధ్ర ప్రేమ ఏమైంది?అని ఆరోపించారు. జనసైనికులు కేవలం నినాదాలిస్తే సరిపోదు.. పోలింగ్ రోజు ఓటు వేసే వరకు ఆ కసి ఉండాలి. అని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *