సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చచ్చిపోతున్న పార్టీని బతికించుకునేందుకు తెలుగుదేశం క్యాడర్ ను కాపాడుకొనేందుకు ముందస్తు ఎన్నికలంటూ చం ద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి జోగి రమేష్ నేటి, గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని, తెలుగుదేశం పార్టీ క్షిణించిపోతుందని ఆయనే స్వయంగా క్యాడర్ సమావేశంలో అన్నారని అందరు చూసారని మరిదానిలో భాగమే ముందస్తు ఎన్నికల డ్రామా అని మంత్రి విమర్శించారు.చంద్రబాబు నైజాన్ని ప్రజలు గమనించాలని, రాష్ట్రంలో నిర్ణిత ప్రకారమే 2024 లో ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు మంత్రి. రాష్ట్రంలో ‘31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి న ఘనత సీఎం జగన్ సాధించారు. ఇళ్ల నిర్మా ణాలు శరవేగం గా జరుగుతున్నాయి. 24 మార్చి లోపు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తాం . ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చకు సిద్ధం. టీడీపీ వాళ్ళు ,వారి పచ్చమీడియా . సంక్షేమ పథకాలను చూసి ఓర్వ లేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *