సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్యాస్ట్రిక్ సమస్యతో వారం రోజుల కిందట గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయనను గత సోమవారం ముంబయి కి లోని ఏఐజీ ఆస్పత్రి కి తరలించారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో కోడలి నానికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకు గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు. అయితే కాస్త కష్టసాధ్యం అయిన బై పాస్ సర్జరీ చేసేందుకు కొడాలి నానిని గత సోమవారం మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలించారు. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ లో ఆయనకు డాక్టర్ రమాకాంత్ పాండా బైపాస్ సర్జరీ చేయనున్నారని తెలుస్తోంది. డాక్టర్ పాండాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. గతంలో మాజీ ప్రధాని, దివంగత నేత మన్మోహన్ సింగ్ ,లకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు. నేడు లేదా రేపటిలోగా కొడాలి నానికి ఆయన బైపాస్ సర్జరీ చేయనున్నారు. ఇక కొడాలి నానికి ఆరోగ్యం గురించి పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
