సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో చిన తిరుమలగా ప్రసిద్ధి పొందిన ద్వారకాతిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాసం సందర్భముగా భక్తులు పోటెత్తున్నారు. మరో వారం రోజులలో జనవరి 2న ముక్కోటి ఏకాదశి పురస్కరిం చుకుని క్షేత్రం ముస్తాబవుతోంది. ఇప్పటికే ఆలయ అధికారులు, సిబ్బంది గిరిప్రదక్షిణ ప్రాంతాన్ని పరిశీలించి ఆ మార్గంలో భక్తులకు, గోవింద దీక్షాదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అందించే దిశగా చర్యలు చేపట్టారు. అలాగే ఉత్తర ద్వారదర్శనాన్ని పురస్క రించుకుని ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాలను రంగులతో ముస్తాబు చేస్తున్నారు. వచ్చే నెల 1న మధ్యాహ్నం 2–30 గంటల నుంచి గిరిప్రదక్షిణ, 2న తెల్లవారుజాము నుంచి శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో త్రినాథరావు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *