సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠం తిరుమల లో నేడు, శనివారం కూడా కావడంతో లక్షల మంది భక్తులు కొండమీదకు చేరటంతో శ్రీవారి ప్రాంగణం తో పాటు కొండ ఫైనే కాదు తిరుపతి పట్టణంలో కూడా ఎక్కడ చుసిన భక్తులే.. ఫై చిత్రంలో శ్రీ వారి స్వర్ణ రథంపై విహరిస్తుండగా ఇసుక వేస్తె రాలనంత భక్తులు ను చూడవచ్చు.. చాల మంది భక్తులు దర్శనం మాట తరువాత కొండమీదకు చేరుకోవడమే మహాభాగ్యం అని శ్రీవారి బంగారు దేవాలయాన్ని, స్వర్ణ రధాన్ని చూసి పరవశించారు.ఉదయం 10 గంటల సమయానికే కంపార్లుమెంట్లు నిండిపోవడంతో క్యూలైన్ మూసివేశారు. ఆ తర్వాత వచ్చిన భక్తులను దర్శనానికి అనుమతించకపోవడంతో కృష్ణతేజ సర్కిల్‌తో పాటు ఈవో కార్యాలయం ముందున్న సర్కిల్లో భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.తిరుమలకు అనుమతించి దర్శనం లేదు పొమ్మంటే ఎక్కడి పోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి గత శుక్రవారం మధ్యాహ్నం నుంచే రద్దీ పెరిగింది.అర్ధరాత్రి తరువాత వైకుంఠ ద్వార దర్శనాలు మొదలుకానున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయం ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ వితరణ కేంద్రం, కాటేజీలు, రోడ్డు, యాత్రికుల వసతి సముదాయాలు, కల్యాణకట్టలు, అన్నప్రసాద కేంద్రం వంటి ప్రాంతాల్లో యాత్రికులు కిక్కిరిసిపోయారు. టోకెన్ ఉన్నవారికే ఎంట్రీ, వసతి వైకుంఠద్వార దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను అలిపిరి చెక్‌పాయింట్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో అనుమతించారు. చాలామంది అలిపిరి నుంచి వెనుదిరిగారు. దీంతో గదులు లేని భక్తులు చెట్ల కింద, పార్కుల్లో,తీవ్రమైన చలికి వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు.
భ
