సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏమిటో పచ్చని గోదావరి జిల్లాలులో సైతం కాలం మారిపోయింది. వేసవి కాలంలో కుంభవృష్టి వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడి అప్పుడు అందరూ సేదతీరారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత పడిన వర్షాలు, రుతుపవనాల ప్రభావం అంతంతమాత్రంగానే ఉండి ఎండలు ప్రచండంగా కాస్తూ గత 15 రోజులు వేసవికాలం తరహాలో ప్రతి రోజు 37 నుండి 42 డిగ్రీల పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలతో .. మరో ప్రక్క తరచూ ఆగిపోయే విద్యుత్తూ సరఫరాలతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. బైక్‌లపై కూడా బయట తిరగలేని పరిస్థితి. టోపీలు పెట్టుకున్నా, కూలింగ్‌ గ్లాస్‌లు ధరించినా మాస్క్‌ లు పెట్టుకున్నా సరే ఎండదెబ్బకు హడలిపోయారు. ఈ వాతావరణంతో మరోపక్క తలపోటు, ఉడుకు జ్వరాలు వచ్చి జనం ఇబ్బందులు పడుతున్నారు. అటు రాత్రి వరకు ఒకటే ఉక్కపోత. ఆపై వేడి తగ్గకపోవడంతో వృద్ధులు, చిన్నారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.మంచి వర్షాలు లేక రైతులు పరిస్థితి దారుణంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వేడిగాలులు వీస్తున్నట్టు శాస్త్రవేతలు చెప్తున్నారు. అయితే నిన్న , గురువారం నుంచి అల్పపీడనం ప్రభావంతో కాస్త అక్కడక్కడా వర్షాలు కురిసిన భారీ వర్షాలు మాత్రం పడక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *