సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అను నేను.. , ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అను నేను.. అంటూ చేసిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి నేడు, బుధవారం అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులైన అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, బండి సంజయ్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో సహా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం కోర్ట్ మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరాజన్, బీజేపీ ఎంపీ పురంధేశ్విరి తదితరులు వచ్చారు. విశిష్ట అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా అతిథుల్ని ఆహ్వానిస్తూ.. వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, సూపర్ స్టార్ కృష్ణ సోదరులు ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు,హరికృష్ణ కుమార్తె సుహాసిని, నటుడు నందమూరి చైతన్య కృష్ణ తదితరులు ఈ వేడుకకి రావడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *