సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షులుగా నియమితులైన భలే ఏసుబాబు, లూర్దమ్మ భీమవరం స్థానిక క్యాంపు కార్యాలయంలో నేటి, మంగళవారం ఉదయం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పట్టణంలో ఉన్న దళిత సోదరులందరు కలిసి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కి శాలువా కప్పి సన్మానించి, స్వీట్స్ పంపిణి చేసారు. దళితులపట్ల ఎంతో ప్రేమ చూపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కి ఎల్లప్పుడూ మా దళితులమందరం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చాలా మంచి పదవి, వైఎస్సార్ పార్టీలో ముఖ్యమైన పదవి, ఈ సేవాదళ్ ను ముందుపెట్టి పార్టీలో అన్ని కార్యక్రమాలు ముందుకు నడిపిస్తారు. సీఎం జగన్ కి ఇష్టమైన పదవులలో ఈ సేవాదళ్ ఒకటి అని అన్నారు. సేవాదళ్ కి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన భలే ఏసుబాబును అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కోడె యుగంధర్, కందికట్ల అడ్వార్డ్, పాలపర్తి జోనా ప్రియదర్శిని, బి.విజయ కుమార్, పి. ప్రసాద్, బుంగా ప్రహ్లాదుడు, జంగం మాణిక్యాలరావు, వై. సునీల్ తదితరులు పాల్గొన్నారు.
