సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ తో 5 రోజులు కాదు నెల రోజులు యుద్ధ విరామానికి సిద్ధంగా ఉన్నామని వెనక్కి తగ్గడంతో ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నట్టు వస్తున్న సంకేతం రావడంతో.. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో జోష్ నింపాయి. భారత దేశీయ మార్కెట్ లో వరుసగా రెండో రోజు కూడా సూచీలు లాభాలు ఆర్జించాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర వంద డాలర్ల దిగువకు వచ్చింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి (Indian stock )..గత సెషన్ ముగింపు (74,068)తో పోల్చుకుంటే నేడు బుధవారం ఉదయం దాదాపు 600 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1800 పాయింట్లు లాభపడి 75,849 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 1205 పాయింట్ల లాభంతో 75,273 వద్ద రోజును ముగించింది. మళ్లీ 75 వేలకు పైన ముగిసింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 394 పాయింట్ల లాభంతో 23,306 వద్ద స్థిరపడింది. . బ్యాంక్ నిఫ్టీ 1102 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1244 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.97గా ఉంది.
