సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఎన్డీయే వెర్సస్ ఇండియా (NDA vs INDIA) కూటమి మధ్య ఎన్నికల యుద్ధానికి నేటి సాయంత్రం 6 గంటలతో తెరపడింది. జార్ఖాండ్‌లో రెండవవిడుత , పోలింగ్ జరుగగా, మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మహారాష్ట్రలో 58.22 శాతం, జార్ఖాండ్‌లో 67.59 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, క్యూలలో నిలబడిన వారికి ఓటింగ్‌కు అవకాశం ఇవ్వడంతో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకారం ఈసారి ఈ 2 రాష్ట్రాలలో ఎన్డీయే కూటమి కె ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని తేల్చాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగగా, 4,136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కూటమిలో భాగంగా బీజేపీ 149, ఏక్‌నాత్ షిండే శివసేన 81, అజిత్ పవార్ సారథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో పోటీ చేసింది. విపక్ష మహా వికాస్ అఘాడిలో కాంగ్రెస్ 101 సీట్లకు, ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (యూబీటీ) 95 స్థానాలకు, ఎన్‌సీపీ (శరద్ పవార్) 86 స్థానాలకు పోటీ చేసింది. జార్ఖాండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియా కూటమి భాగస్వాములైన జేఎంఎం 43 సీట్లలో, కాంగ్రెస్ 30 సీట్లలో ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) ఒక స్థానంలో పోటీ చేసింది. జార్ఖాండ్, మహారాష్ట్రతో పాటు, 15 స్థానాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్‌లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి.
