సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, భూపతిరాజు శ్రీనివాస వర్మ భీమవరంలోని నివాసం వద్ద నివాసంలో నేడు, శనివారం రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా ఆయన ముగ్గురు సోదరీమణులు కలిదిండి అన్నపూర్ణ దేవి, మంతెన నాగ శిరోమణి, మరియు వేగేశ్న జ్యోతి లక్ష్మిలు సంప్రదాయబద్ధంగా తమ సోదరుడికి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించారు. అనంతరం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తమ సోదరీమణులకు నూతన వస్త్రాలను బహూకరించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “రాఖీ పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అని, మన సంస్కృతిలో అంతర్భాగమైన కుటుంబ విలువలకు, సోదర సోదరీమణుల మధ్య ఉన్న అమూల్యమైన బంధానికి నిలువెత్తు సాక్ష్యం” అని రాఖి ని చుస్తే మన సోదరీమణులకు భద్రత, గౌరవం కల్పించాలన్న మన బాధ్యతను గుర్తు చేస్తుందని పవిత్రమైన రాఖీ పౌర్ణమి రోజున తన ముగ్గురు అక్కల ఆశీర్వాదం పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు శ్రీనివాస వర్మకు రాఖీలు కట్టారు. శ్రీమతి భూపతిరాజు వెంకటేశ్వరి దేవి, కలిదిండి వినోద్ వర్మ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
