సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13 లక్షల 38 వేల రూపాయల బంగారు ఆభణాలు, 5 మోటారు బైక్ లు స్వాధీనం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రకటించారు. భీమవరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. కాళ్ల మండలం సీసలిలోని ముగ్గుళ్ల నర్సింహారావు ఇంటిలో దొంగతనానికి పాల్పడిన అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంకు చెందిన జొన్నల వెంకటేశ్, కాళ్ల మండలం బొండాడపే టకు చెందిన ఆకురాతి జోష్ణదేవితోపాటు భీమవరంలోని అట్టిక గోల్డ్ కంపెనీలో పనిచేస్తున్న పాలకొల్లుకు చెందిన గొర్రెల కృష్ణలను అరెస్టు చేశామన్నారు. నిందితులను ఆకివీడు సీఐ వి.జగదేశ్వరరావు, ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు పట్టుకొని విచారించగా జొన్నల వెంకటేష్, ఆకురాతి జోష్ణ దేవి జిల్లాలోని ఉండి, పెంటపాడు, తణుకు రూరల్, తాడేపల్లిగూడెం రూరల్, ఏలూరు జిల్లాలో ని లక్కవరం, తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజ ర్ల ప్రాంతంలో బంగారు గొలుసులు దొంగతనాలకు పాల్పడ్డామని తెలిపారన్నారు. కాళ్ళ, ఉండ్రాజవరం, ముదినేపల్లి పరిధిలో మోటారు సైకిళ్లను దొంగతనం చేశారన్నారు. జొన్నల వెంకటేశ్ అయితే ఆటోలు, బస్సులు కోసం ఒంటరిగా ఉన్న మహిళలను, వృద్దులను లిఫ్ట్ ఇస్తానని చెప్పి మోటారు సైకిల్‌పై లిప్ట్ ఇచ్చి వారి మెడల్లోని బంగారు ఆభరణాలు దొంగిలించే వాడన్నారు. నిందితులు బ్యాంకు ఖాతాలను సీజ్ చేశామన్నారు. ఈ కేసులో అట్టిక గోల్డ్ యాజమాన్యం ను కూడా విచారించవలసి ఉందన్నారు.. సీఐ జగదీశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు, కానిస్టేబు ళ్లను అభినందించి నగదు రివార్డులను అందించారు. సమావేశంలో డీఎస్పీ ఆర్.జయసూర్య, ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వరరావు, ఎస్‌ఐ ఎన్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
