సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు వేణు.. బలగం సినిమా దర్శకుడు గా ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసాడు. ఆతర్వాత దర్శకుడిగా నాని హీరోగా ఎల్లమ్మ సినిమా ప్రకటించారు. అయితే నాని తప్పుకోవడంతో నితిన్ హీరోగా ఎల్లమ్మ సినిమా ఉంటుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఆ తర్వాత వరుస పరాజయాల తో నితిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఆ సినిమాలో హీరోగా ఎవరు చేస్తారు అని అందరూ అనుకున్నారు. ఇటీవల మీడియాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతను కూడా ఈ సినిమా చేయడం లేదని తెలుస్తుంది. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఎల్లమ్మ సినిమాకు హీరో దొరికేశాడని తెలుస్తుంది.ఆయన ఎవరో కాదు ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు దేవీ శ్రీ ప్రసాద్.ఎంతో కాలంగా సినిమా హీరోగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నా దేవీశ్రీ ప్రసాద్ (DSP)ఇప్పుడు హీరోగా రాబోతున్నారని ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *