సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న వంట నూనె ధరలు సామాన్యుల ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సన్ ఫ్లవర్ నూనె ఒక లీటర్ సుమారు 150 కు చేరింది. దీనికి కారణం సెప్టెంబర్ 2024లో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు కూడా పెరిగాయి. వంటగదిలో ఉపయోగించే నూనె మరింత ఖరీదైనదిగా మారింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే వార్తను అందించింది. ముడి వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం (BCD)ని ప్రభుత్వం 20% నుండి 10%కి తగ్గించింది. ఈ తగ్గింపు ముడి పొద్దుతిరుగుడు, సోయాబీన్, పామాయిల్‌పై వర్తిస్తుంది. దానితో విదేశాల నుండి ముడి నూనె ను భారత్ దిగుమతి చేసుకొని ఇక్కడ ఫిల్టర్ చేసి నూనెను మార్కెట్ కు విడుదల చేస్తారు. దీనితో మరికొద్ది రోజులలో ఫిల్టర్ చేసిన నూనె ధరలు కూడా 10 శాతం పైగా తగ్గనున్నాయి.
