సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎవరు అవున్నన్నా కాదన్నా? దశాబ్దాలుగా కాపుల హక్కుల సాధన కోసం పార్టీలు ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించిన ‘ముద్రగడ పద్మనాభం’ ఒక ఐకాన్ లీడర్.. అయితే ఆయన రెండు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం లో పాల్గొనకపోయిన ఒక లేఖలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను అనారోగ్య కారణాలతో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనలేకపోయానని ప్రస్తావించారు. అయితే ఈ క్రమంలో ముద్రగడ కుమార్తె క్రాంతి చేసిన ట్వీట్ వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయనకు సరైన వైద్యం అందడం లేదని కుమార్తె క్రాంతి ఆరోపించారు. తండ్రిని ఎవరూ కలవకుండా కుమారుడు తన సోదరుడు గిరి నిర్బంధించారని, చికిత్సకు ఆటంకం కలిగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా కలవడానికి వెళ్ళితే తండ్రి ని కలవనివ్వకుండా అడ్డుకొన్నారని వాపోయారు. ( నిజానికి ముద్రగడ పద్మనాభనాభం జనసేన లో చేరి తనను అవమానించిన కూతురును జీవితంలో క్షమించనని గతంలో ప్రతిన బూనారు. పట్టుదల వస్తే పేరే పద్మనాధ రెడ్డి అని మార్చేసుకొన్న ఆయన కుమార్తె ను ఇష్టపడతారా ? ఆయనకు నిజంగా క్యాన్సర్ వచ్చి ఉంటె ఆయన కచ్చితంగా అభిమానులకు వివరణ ఇవ్వవలసిన అవసరం అయితే ఉంది.
