సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇక ఎన్నికల కోడ్ రాబోతున్న కొద్దీ గంటల ముందు.. ఏపీలో జగన్ సర్కార్ ఏపీలో మునిసిపల్ కార్మికులపై విధినిర్వహణ నిర్లక్ష్యం ఫై ఉన్న పలు కేసులను వారిని క్షమించి ఎత్తివేయడంతో పాటు.. అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 22వ తేదీ వరకు వేతనాల పెంపుతో సహా పలు డిమాండ్లతో అంగన్వాడీలు సమ్మె చేశారు. మొత్తం 42 రోజులపాటు అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. కాగా, ఈ 42 రోజుల సమ్మె కాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణిస్తూ జీతాలు చెల్లించనున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సమ్మె కాలాన్ని చెల్లించే జీతంలో కోత విధిస్తూ ఉత్తర్వులను జారీ చెయ్యడం విశేషం..
