సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో ఒకే ఒక్క తాడిపత్రి మినహా అన్ని మునిసిపల్ , నగరపాలక కార్పొరేషన్స్ లో వైసీపీ 90 శాతం పైగా కౌన్సెలర్స్ సాధించి అన్ని చైర్మెన్, మేయర్ సీట్లు సాధించి చరిత్ర సృష్టించిన ఘటన అప్పట్లో దేశ రాజకీయాలలో సంచలనం. అయితే చాల స్వల్ప కౌన్సెలర్స్ ఓట్ల మెజారిటీతో( 2 కౌన్సిల్ సభ్యులు ఓట్లు అదనంగా) వచ్చినప్పటికీ టీడీపీ కి రాష్ట్రంలో ఏకైక మునిసిపల్ చైర్మెన్, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక కావడం.. జగన్ తలచుకొంటే నా సిటు మార్చగలడు..అయితే జగన్ జెంటిల్ మెన్’ అంటూ జేసీ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఎవరు మర్చిపోలేదు. మరి ఇప్పడు దానికి బిన్నంగా.. గత అసెంబ్లీ ఎన్నికలలో ‘వైసీపీ దారుణ పరాజయం’ తరువాత అధికార కూటమి కన్ను స్థానిక సంస్థలపై పడింది. అయితే కొన్ని చోట్ల ఈ పార్టీ పిరాయింపులకు స్థానిక టీడీపీ నేతలు సైతం అభ్యన్తరం పెట్టడం గమనార్హం. అవకాశం ఉన్నచోట్ల అధికార పార్టీ ప్రాపకం కోసం వైసీపీ లో ఉన్న జంపింగ్ జిలానీలు సహకారంతో టీడీపీ తరపున చైర్మెన్, లేదా వైస్ చైర్మెన్ పదవులు పొందే ఆశావహులు ను ప్రోత్సహించారు. (అది కూడా 50 కౌన్సెలర్స్ లో కేవలం ఒక్కటి..2 మాత్రమే టీడీపీ గెలిచిన సరే అక్కడ పార్టీ పిరాయింపులతో టీడీపీ చైర్మెన్ లేదా మేయర్ రావలసిందే).. ఈ నేపథ్యంలో నిన్న సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 10నగరాల్లో ఎన్నికలు జరిగితే.. 6చోట్ల కూటమి విజయం సాధించింది. స్థానిక వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించిన తిరుపతి లో ఉప మేయర్ ఎన్నికతో సహమరో 3 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి కీలకమైన హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు వస్తే.. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. రమేష్‌ను చైర్మన్‌ కుర్చీలో కూర్చోపెట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ .గుంటూరు కార్పొరేషన్‌లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *