సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి లోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో నేటి సోమవారం తెల్లవారు జామున 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్నా లారీని కారు ఢీ కొన్న దుర్ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది. (ఫై తాజా చిత్రంలో తునాతునకలు అయినా కారు.. బెండ్ అయిన లారీని చూడవచ్చు..)
