సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రానికి అక్కడి నుంచి కళ్లితండాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దేశం కోసం తన ప్రాణాలు బలిపెట్టిన అమరవీరుడు భారత్ జవాన్ మురళీ నాయక్(25)భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కొంత ఎమోషనల్‌కు గురయ్యారు. పవన్‌తో పాటు మంత్రులు లోకేశ్, సత్యకుమార్, సవిత వారి కటుంబాన్ని ఓదార్చారు.ఈ సందర్భంగా.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అమర జవాను మురళీనాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.వ్యక్తిగతంగా రూ. 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అర్దిక్ సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
