సిగ్మాతెలుగు డాట్, న్యూస్: సీఎం జగన్ నేడు, బుధవారం అనంతపురం జిల్లా లో నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం నిధులు విడుదల చేశారు. ఈ సందర్భముగా బహిరంగ సభలో చంద్రబాబు , పచ్చమీడియా నుద్దేశిస్తూ .. జాతీయ మీడియాకు ఒక ముసలాయన ఇంటర్వ్ ఇచ్చారని, వచ్చీరానీ ఇంగ్లీష్‌తో రిపబ్లిక్ టీవీకి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చారన్నారు. అది చూస్తే తనకు పంచతంత్రం కథలు గుర్తుకొచ్చాయన్నారు. నరమాంసం తినే పులి ఇప్పుడు ముసలిదైందన్నారు. వేటాడే శక్తి లేకనే మరో నాలుగు నక్కలను తోడేసుకుందన్నారు. మనుషులను చంపడం ఎలా అని ప్లాన్ చేసిందని, ఆ పులి అడవిలో తనకు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని అనుభవం అటుగా వెళ్లేవారికి చెబుతోందన్నారు. పులి ఇప్పుడు తానెవరినీ తినడంలేదని నమ్మిస్తోందని.. నరమాంసం తినే పులి.. మారిందంటే నమ్ముతామా? అని ప్రశ్నించారు. చేతిలో బంగారు కంకణం ఇస్తానని ఆశ చూపి తన దగ్గరకు వచ్చే వారిని చంపి తినేదని కధ గుర్తుచేశారు, మాయమాటలు చెప్పేవారిని ఎప్పుడూ నమ్మొద్దని, చంద్రబాబుకు ఎప్పుడూ బుద్ధి రాదని, మళ్లీ మోసం చేసేందుకే చంద్రబాబు పాత డైలాగ్‌లు మాట్లాడుతున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
