సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: మంగళగిరి లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం అంటే క్రమశిక్షణ, సేవ. ఖురాన్ ఆవిర్భవించిన నెలకు గుర్తుగా రంజాన్ పండుగ చేసుకుంటాం. నేను 40 ఏళ్లుగా రంజాన్ పండుగ లో భాగస్వామిని అవుతున్నా, నాడు సిఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉర్ధూను రెండో అధికార భాషగా అమలు చేశామని, మైనారిటీ వర్గంలో ఉన్న పేదలను ఆదుకునేందుకు 1985లోనే నాడు ఎన్టీఆర్ మైనారిటీ కార్పొరేషన్ తీసుకువచ్చారు అని, ముస్లిం సోదరుల కోసం హైదరాబాద్ లో శాసన సభ ఎదురుగా హజ్ హౌస్ కట్టి సదుపాయలు కల్పించి మక్కా యాత్రకు పంపింది తెలుగుదేశం ప్రభుత్వమే నని, .2014 తరువాత ఎపిలో విజయవాడ, కర్నూల్ లో హజ్ హౌస్ లు కట్టాం. నవ్యాంధ్రలోనూ ఉర్థూ యూనివర్సిటీ తెచ్చామని, ఇమాంలకు, మౌజుంలకు గౌరవ వేతనం ఇచ్చామని, దుల్హన్ అనే పథకం ద్వారా పేద ముస్లిం యువతులకు ఆర్థిక సాయం చేశాం. నాడు 50 వేలు ఇచ్చాం.మరి జగన్ సర్కార్ వచ్చాక దుల్హన్ పథకం పై అనేక ఆంక్షలు పెట్టింది అని విమర్శించారు. ముస్లిం లు అంతా రాష్ట్ర భవిష్యత్ కోసం అల్లాను ప్రార్థించాలి. తెలుగు దేశం రావాలి…రాష్ట్రం అభివృద్ది కావాలి అని పిలుపు నిచ్చారు.
