సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా భావించే ‘రంజాన్ మాసం’ నేటి మంగళవారం నుంచి ప్రారంభించారు. నిన్న రాత్రి భారత్ లో నెలవంక కనిపించడంతో (లక్నో,ఆగ్రా, కోల్ కతాలో నెలపొడుపు సాయంత్రం 6.52 నిమిషాలకు కనిపించడంతో ) నేటి మంగళవారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించామని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. ముస్లింలు అత్యంత భక్తి, శ్రద్దలతో, నియమ, నిష్టలతో ఈ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు కనీసం మంచినీళ్లు కాదు కదా కనీసం నోటిలోని లాలా జలాన్ని కూడా మింగకుండా భగవంతుడ్ని ప్రార్ధిస్తారు. రోజులో సూర్యోదయానికి ముందు సహర్ నుంచి సూర్యస్తమయం ఇఫ్తార్ వరకు రోజూకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు రాత్రి 8.30గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య కాలంలో తరావీహ్ నమాజులో ఖురాన్ చదువుతారు. ముస్లీమ్ సోదరులకు శుభాకాంక్షలతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *