సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు లో యువ హీరో విశ్వక్ సేన్ వైవిధ్యం వున్న పాత్రలను ఎంచుకుంటూ విజయాలు సాధిస్తూ దూసుకొనిపోతున్న నేపథ్యంలో ..విద్యాధర కాగిత దర్సకత్వంలో 5 ఏళ్లుగా నిర్మాణం జరుగుతున్నా ‘గామి’ సినిమా .. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారి అఘోర జీవన విధానాలపై సైన్స్ కు అందని ఆధ్యాత్మిక అద్భుతాలపై విశేషణాత్మకంగా పై తీసిన వైవిధ్యమున్న సినిమా ‘గామి’ నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కధ విషయానికి వస్తే.. శంకర్ (విశ్వక్ సేన్) ఒక అఘోర, అతనికి మానవ స్పర్శ, అంటే ఇంకొక మానవుడిని ఎవర్ని ముట్టుకున్నా అతనికి అదొక రకమైన వ్యాధి వచ్చి చనిపోతాడు. శంకర్‌కి ఉన్న ఈ వ్యాధికి మందు హిమాలయాల్లోని త్రివేణి సంగమం దగ్గర ఉండే 35 ఏళ్లకు ఒకసారి మొలిచే ఒక మొక్కలో ఆ ఔషధం ఉంటుందని, ఆ ఔషధం తీసుకుంటే శంకర్ వ్యాధి నయమవుతుందని స్వామీజీ చెప్తాడు. జాహ్నవి (చాందిని చౌదరి) ఒక డాక్టర్, రీసర్చ్ కోసం అదే ఔషధం కోసం ప్రయత్నం చేస్తుంది. శంకర్‌ని ఆ హిమాలయాలకి తీసుకువెళతానంటుంది. మరోవైపు ఒక గ్రామంలో దుర్గ అనే దేవదాసి తన కుమార్తె ఉమతో ఉంటుంది. ఆమెకుమార్తెని దేవదాసిగా చేయాలని చూస్తారు.ఇదో ఉపకథ .. ఇంకోవైపు ఒక లేబరేటరీలో మనుషుల మీద వివిధ రకాలైన భయంకరమైన పరీక్షలు చేస్తూ ఉంటారు ఇదో ఉపకథ ఈ మూడు కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకపోయిన దివ్య ఔషధం వద్ద కలుస్తాయి. ఎందుకో తెలుసుకోవాలంటే ‘గామి’ సినిమా చూడాల్సిందే.. ఇక ‘గామి’ సినిమా తీసిన నిర్మాతకు, అలాగే దర్శకుడు విద్యాధరకు, శంకర్ పాత్రలో లీనమై నటించిన విశ్వక్ సేన్ కు ముందు అభినందనలు చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినిమాలో ఇదో విభిన్న సినిమా.. వ్యాపార విలువలే కాకుండా ఒక మంచి కథ తో .. ఒక్కో సన్నివేశం చెక్కుతూ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది.సినిమాలో మనకి నటులు గుర్తుకురారు పాత్రలే గుర్తుంటాయి. అందరు బాగా చేసారు. అందమైన ఆ మంచు ప్రదేశాలు, ఆ కొండలు, ఆ పర్వతాలు, ఔషధం కోసం శంకర్ పడే పాట్లు, సాహసాలు, సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. విశ్వనాధ్ రెడ్డి కెమెరా పని తనం మరో హైలైట్.. సంగీతం అందించిన నరేష్ కుమరన్ సినిమాకు మరో అదనపు బలం.. అందరు మేధావులే.. మరి విభిన్న చిత్రాలు చూడాలనుకునే ప్రేక్షకులకు గామి తప్పకుండ పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *