సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు ఏపీలో కోనసీమకు అనుబంధంగా ఉన్న ‘యానాం ‘తో సహా పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం, కేరళంలో 75.01 శాతం పోలింగ్ నమోదు అయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.గురువారం ఉదయం అసోం (126), కేరళం (140), పుదుచ్చేరి (30) లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల పోలింగ్ వేళ.. ఏర్పాట్లను ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఇక తమిళనాడు లో కూడా ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
