సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ.. మెగాస్టార్ ఆచార్య’ చిత్రాన్నీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎన్నో అడ్డంకులు .. 5నెలలలో సినిమా పూర్తీ చేస్తామని చెప్పి 3 ఏళ్ళు దాటేస్తున్న షూటింగ్ లేట్.. కరోనా..తదితర అడ్డంకులతో విడుదలలో చిరు అభిమానులను నిరాశ పరుస్తూనే ఉన్నాడు.. ఆచార్య .. ముందు RRR కోసం సంక్రాంతికి లేదు అన్నారు. తీరా ఆ సినిమా వాయిదా వేసిన అదే జనవరి 7న ఆచార్య వస్తుందనుకొంటే..? ఉహు.. ఇంకా సిద్ధం కాలేదన్నారు. ఏపీలో సినిమా టికెట్స్ ధరలు ప్రభావం అన్నారు. అయితే మరోసారి సినిమా యూనిట్ ఫిబ్రవరి 4న కొత్త విడుదల తేదీని ఖరారు చేసారు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం . ‘ఆచార్య’ చిత్రాన్ని ఉగాది పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీన అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. చూడాలి.. ఈసారి అయిన ఆచార్య సినిమాపై వస్తున్నా రూమర్స్ కు సమాధానం చెప్పుతాడని కోరుకొందాం.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కాజల్, పూజాహెగ్డే లతో సూపర్ డైరెక్టర్ కొరటాల శివ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి..
