సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం Film Personality of the Year లభించింది.. 150 కి పైగా సినిమాలలో హీరోగా నటించి, చిత్ర రంగానికి ఆయన అందించిన సేవలకుగానూ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ – 2022 అవార్డు వరించింది. తాజాగా నేడు, సోమవారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా Iffi 53 కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ పురస్కారాన్ని ప్రకటించారు. అలాగే భారతీయ సినీ పరిశ్రమకు చిరంజీవి చేసిన సేవలు కొనియాడుతూ అభినందనలు తెలిపారు. తాజాగా చిరంజీవికి ఈ పురస్కారం రావడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్విట్టర్‌లో మోదీ చేసిన పోస్ట్‌లో.. ‘చిరంజీవిగారిని ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన పని, వైవిధ్యమైన పాత్రలు, అద్భుతమైన స్వభావం తరతరాలుగా సినీ ప్రేమికులకు ఆయన వైపు ఆకర్షించేలా చేస్తున్నాయి. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నందుకు ఆయనకు అభినందనలు’ అని పేర్కొన్నారు. మోదీ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి ఆయన పోస్ట్‌కి చిరంజీవి రిప్లై ఇచ్చారు.చిరంజీవి చేసిన ట్వీట్‌లో.. ‘ఇలాంటి మంచి మాటలు చెప్పిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. .
