సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటివరకు తెలుగునాట రగిలిపోతున్న మెగా – అల్లు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చే సంఘటన నేడు, జరిగింది. ఎవడికిరా బాస్.. వాడికి వాడి తమ్ముడికి.. వాడి కొడుక్కి నేనే ఇక బాస్..ఆ పావలా .. అంటూ పుష్ప తో రెచ్చగొట్టిన డైలాగ్స్.., ఇటు పిఠాపురం అమలాపురం భీమవరంతో సహా పుష్ప పోస్టర్స్ చింపేసి పుష్ప 2ఎవరు చూడటంలేదని తమ అసహ్యాన్ని చాటుతూ ప్రచారం చేసిన మరికొందరు అభిమానులు .. మరో ప్రక్క పలు చోట్ల పుష్ప2 ప్రదర్శిస్తున్న థియేటర్స్( కుప్పంలో 2 థియేటర్స్ ) రెన్యూవల్ చెయ్యలేదని రెవెన్యూ అధికారులు మూయించి వేత .. ఇల్లాంటి కోకొల్లు ఘటనలు అభిమానుల మధ్య దూరం పగ ను పెంచాయి. దీనిలో రాజకీయా పార్టీలు నేతలు తలో చెయ్యి వేశారు. టివి ఛానెల్స్ కు కంటెంట్ పెరిగింది. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లు దాటి అఖండ విజయం సాధించిన ఆ విజయంపై మెగా ఫ్యామిలీ స్వాందించలేదు. అటు మెగా- ఇటు అల్లు ఫ్యామిలీలు తగ్గేదేలే అంటూ వ్యవహరించారు. అయితే సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది. ఈ కేసు విషయంలో అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో మొత్తం కధ మారిపోయింది. బన్ని ఇంటికి చిరంజీవి దంపతులు , నాగబాబు వెళ్లి పరామర్శించారు.బెయిల్ ఫై విడుదల కాగానే అల్లు అర్జున్ ను చిరంజీవి,సురేఖ దంపతులు అల్లు అర్జున్ ను భోజనానికి ఆహ్వానించారు. దీనితో అల్లు అర్జున స్వయంగా కారు నడుపుకొంటూ నేటి మధ్యాహ్నం చిరంజీవి ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్‌తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. ఎలా ఉన్నావ్ అల్లుడు అంటూ చిరంజీవి ఆప్యాయంగా పలకరించి స్వీట్స్ తినిపించి భోజనం కొసరి కొసరి ఒడ్డించారు .ఇక మెగా- అల్లు కుటుంబ బంధం బలపడింది. అది సహజం కూడా..మరి ఇప్పటివరకు నిప్పు- పెట్రోలు లా సోషల్ మీడియా లో రోడ్లపై చెలరేగిపోయిన వారి అభిమానులు .. వారి కుటుంబ సమస్యల కన్నా మెగా- అల్లు కుటుంబాల ప్రతిష్ట తమ ప్రతిష్టగా భావించి ఒకరినొకరు ద్వేషించుకొన్న అభిమానులును, విడిపోయిన స్నేహితులను ఎవరు కలుపుతారు ? మొన్న మోహన్ బాబు చూడండి.. గేటు బ్రద్దలు కొట్టి వచ్చిన కొడుకు మనోజ్ ను వదిలేసి మీడియా వాళ్ళను కొట్టాడు.. ఆలా ఉంటాది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ‘సినిమా వాళ్ళు సినిమాలు తీస్తారు డబ్బులు సంపాదించుకొంటారు..వ్యాపారం చేస్తారు తప్ప వారేమి దేశానికీ సేవ చెయ్యరు.’ కొంత వాస్తవం కనిపించడం లేదా?ఇది అందరి హీరోల అభిమానులకు వర్తిస్తుంది.
