సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి నిరుద్యోగులకు చాల ఆలస్యం అయినప్పటికీ ఊరించి ఊరించి ఏపీ ప్రభుత్వం నేడు, ఆదివారం ఉదయం ‘మెగా డీఎస్సీ’ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేడు సీఎం చంద్రబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘మెగా డీఎస్సీ ‘నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామని ఉద్ఘాటించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రకటించారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 13,192 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్జీటీ , స్కూల్ అసిస్టెంట్‌తో పాటు 52 ప్రిన్సిపాల్, 273 పీజీటీ, 1718 టీజీటీ పోస్టులను రాష్ట్ర, జోన్ స్థాయి కోటాలో భర్తీ చేయనున్నాట్లు ప్రకటించారు.
