సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఎన్డీయే కూటమి సర్కారు సిద్ధం అవుతుంది. గత ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తారని తెలుస్తుంది. దీనిపై జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి. దానికి మరో 10 వేలు పైగా ఉద్యోగాలు కలిపి మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జూలై 1న షెడ్యూలు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనిని మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. మెగా డీఎస్సీకి గత సోమవారం కేబినెట్ ఆమోదం లభించింది. మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్లీ టెట్ నిర్వహిస్తారు.
