సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం గవర్నర్ ను కలుస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ కు వ్యతిరేకంగా ప్రజలు నుండి కోటి సంతకాల సేకరణ ఒక చరిత్ర అని. ఈ సంతకాలను గవర్న ర్కు సమర్పించి..చంద్రబాబు పిపిపి నిర్ణయం పట్ల ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తామని, అవసరమైతే ఈ పత్రాలతో కోర్టు తలుపులు తడతాం.అన్ని ఆధారాలతో కోర్టు లో పిటిషన్ వేస్తాం. మేము ఇంతాచేసిన సీఎం చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్.జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉండి.. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలను చంద్రబాబు ప్రైవేటు పరం చేయడం ఒక స్కామ్ అయితే.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం చెల్లించడం మరో పెద్ద స్కామ్. ప్రైవేట్ వారికీ అప్పగించాక ఇక ప్రభుత్వం జీతాలు చెల్లించడం ఏంటి?. మెడికల్ కాలేజీల సిబ్బందికి జీతాల కింద రెండేళ్లకు దాదాపు రూ .140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ .1400 కోట్లు. ఇది కదా పెద్ద స్కామ్ అంటే!.రేపు మనం అధికారం లోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం .చం ద్ర బాబు కు గట్టి గుణపాఠం చెబుతాం ’’ అని జగన్ హెచ్చరించారు.
